CM Jagan: గులాబ్‌ తుపాను(Cyclone Gulab) అనంతరం పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు కలెక్టర్లుతో మాట్లాడి..అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మానవతా దృక్పథంతో వ్యవహారించండి:
వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని జగన్‌(CM Jagan) ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని వెంటనే ఇవ్వాలని.. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. ‘‘బాధితులకు సాయం చేయడంలో వెనకడుగు వేయొద్దు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం(Food) నాణ్యంగా ఉండాలి. మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలి. అవసరమైన అన్ని చోట్లా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి. 


Also Read: Cyclone Gulab live updates, Kalingapatnam: కళింగపట్నం సమీపంలో తీరం దాటిన గులాబ్ తుపాను


ఇప్పటికే శ్రీకాకుళం(Srikakulam)లో ఉన్న సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌(CS Adityanath Das)ను అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పరిస్థితిని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సీఎంకు వివరించారు. జిల్లాలోని 12 మండలాల్లో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 38 పునరావాస కేంద్రాల్లో 1514 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్‌ సీఎంకు వివరించారు. 


పంట అంచనాలను సిద్దం చేయండి:
విశాఖ నగరంలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌ చేసి తొలగించే పనిని ముమ్మరంగా చేపట్టాలి. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు రూ.1000 చొప్పున సాయం అందించాలి. సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 ఇవ్వాలి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేపట్టాలి. నష్టం అంచనాలు వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం ఆదేశించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook