CM Jagan Counter to Chandrababu: ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం జగన్ (CM Jagan) స్పందించారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలంటూ అసెంబ్లీ వేదికగా చురకలంటించారు. చంద్రబాబు దేనికోసం అక్కడికి వెళ్లారు... ఏం మాట్లాడారని ప్రశ్నించారు. తనను వ్యతిరేకించిన వైఎస్సార్ కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆక్షేపం వ్యక్తం చేశారు. విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని.. ఎక్కడో ఒకచోట నేను శాశ్వతంగా కనుమరుగువుతానని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తనను వ్యతిరేకించిన వైఎస్సార్ కూడా కాలగర్భంలో కలిసిపోయారని మాట్లాడారు. ఆయన సంస్కారానికి నా నమస్కారాలు. ఆయన వెళ్లింది ఏ పర్యటనకు... ఏం మాట్లాడుతున్నారు...?' అని సీఎం జగన్ (CM Jagan) చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వరద ప్రభావిత (AP Floods) ప్రాంతాలకు తాను వెళ్లలేదన్న విమర్శలను జగన్ తిప్పి కొట్టారు. తాను అక్కడికి వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందించడమే ముఖ్యమని అన్నారు. వరద సహాయక చర్యలు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో... సీనియర్ అధికారుల సూచన మేరకే తాను అక్కడికి వెళ్లలేదన్నారు.


Also Read: RRR Janani Song: విడుదలైన RRR జనని సాంగ్..రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న భావోద్వేగాలు


ప్రస్తుతం జిల్లా యంత్రాంగాలన్నీ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. సహాయక చర్యలు పూర్తయ్యాక తానే వెళ్లి వరద బాధితులతో మాట్లాడుతానని తెలిపారు. గతంలో హుద్‌హుద్, తిత్లీ తుఫాన్లను తానే ఆపానని చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ బాధితులకు అరకొరా సహాయం కూడా చేయలేకపోయారని విమర్శించారు. ఇక వర్షాలు, వరదలపై మాట్లాడుతూ... గత వందేళ్లలో కనీవిని ఎరగని రీతిలో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయన్నారు. కరువు ప్రాంతం రాయలసీమలోనూ ఊహించని రీతిలో వరదలు వచ్చాయన్నారు. వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలను ప్రభుత్వం ఎక్కడా దాచిపెట్టలేదని అన్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని జగన్ స్పష్టం చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి