AP CM YS Jagan convoy వెంట పరుగెత్తిన మహిళ.. కారు ఆపిన సీఎం జగన్

AP CM YS Jagan convoy రేణిగుంట ఎయిర్ పోర్టులో (CM Jagan at Renigunta airport) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా సందర్భాల్లో జనం ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లను ఆపేందుకు, అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. ప్రజాప్రతినిధులు ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలే అధికంగా కనిపిస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 07:18 PM IST
  • రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆసక్తికరమైన ఘటన
  • సీఎం జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ
  • మహిళ తన కాన్వాయ్ వెంట పరుగులు తీయడం గమనించిన సీఎం జగన్
AP CM YS Jagan convoy వెంట పరుగెత్తిన మహిళ.. కారు ఆపిన సీఎం జగన్

AP CM YS Jagan convoy తిరుపతి: రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో ఆదివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తిరుపతిలో సౌత్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఆ సమావేశానికి హాజరయ్యేందుకు రాజధాని అమరావతి నుంచి బయల్దేరిన ఏపీ సీఎం వైయస్ జగన్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి బయల్దేరిన ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు తీయడం కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నప్పటికీ.. ఆ దృశ్యం కాన్వాయ్‌లో ఉన్న సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan's convoy) కంటపడకుండాపోలేదు.

మహిళ తన కాన్వాయ్ వెంట పరుగులు తీయడం గమనించిన సీఎం జగన్.. తన కారును ఆపారు. ఆమెతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాల్సిందిగా తన ఓఎస్డీని పంపించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వాహనం దిగి సదరు మహిళ వద్దకు చేరుకున్న ఓఎస్డీ ఆమెతో మాట్లాడారు. ఉద్యోగం కోసం మహిళ ఇచ్చిన వినతి పత్రం తీసుకున్న ఓఎస్డీ (AP CM Jagan's OSD).. ఆమె సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Also read : Amit Shah: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై అమిత్ షా ప్రశంసల వర్షం

రేణిగుంట ఎయిర్ పోర్టులో (CM Jagan at Renigunta airport) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా సందర్భాల్లో జనం ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లను ఆపేందుకు, అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. ప్రజాప్రతినిధులు ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలే అధికంగా కనిపిస్తుంటాయి. కానీ ఈ విషయంలో మాత్రం సీఎం జగన్ కాన్వాయ్ (AP CM YS Jagan) ఆపి సదరు మహిళ నుంచి వినతి పత్రం తీసుకోవడం అభినందించదగిన విషయం అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also read : Visakhapatnam: ప్రేమను నిరాకరించిందని.. యువతిపై పెట్రోల్ తో దాడి..ఆపై...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News