ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. తిరుమల నుంచి హైదరాబాద్‌కు విచ్చేసిన ఏపీ సీఎం బేగంపేట ఎయిర్‌‌పోర్టు నుంచి నేరుగా కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు.  Narottam Mishra: మాస్కు ధరించను.. అయితే ఏమైంది?.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన సతీమణి వైఎస్ భారతి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డిని పరామర్శించారు. గంగిరెడ్డి ఆరోగ్యం వివరాలు తెలుసుకుని, ఆసుపత్రిలో కొంత సమయం గడిపిన వైఎస్ జగన్ తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. Bhiwandi Death Toll: 41కి చేరిన మృతుల సంఖ్య.. సహాయక చర్యలు నిలిపివేసిన ఎన్టీఆర్ఎఫ్


కాగా, గత మూడు రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. మొదటగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిషా, ఇతర నేతలను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మరుసటి రోజు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు, పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల నుంచి తాడేపల్లి వెళ్లాల్సి ఉండగా.. భార్య భారతి రెడ్డి తండ్రిని పరామర్శించేందుకు హైదరాబాద్‌ రావాల్సి వచ్చింది. Viral Video: అతడే అసలైన హీరో.. నెటిజన్ల ప్రశంసలు 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe