Kodi Pandalu: సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, గొబ్బిళ్లు..పిండి వంటలే కాదు తెలుగు పల్లెల్లో కోడి పందేలు కన్పిస్తాయి. ఇక్కడి కోళ్లు ఢీ అంటే ఢీ అంటాయి. బరిలో దిగిందంటే చావో రేవో తేల్చుకోవల్సిందే. పందెం రాయుళ్లకు కాసుల వర్షమే. ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగ మూడ్రుజుల్లో జరిగిన పందెం విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోడి సై అంది. ఢీ అంటే ఢీ అంటూ బరిలో దిగింది. కొందరికి కాసుల వర్షం..మరి కొందరికి భారీ నష్టం. సంక్రాంతి సందర్భంగా రెండు జిల్లాల్లో భారీగా కోడి పందేల బరులు (Kodi pandalu) వెలిశాయి. కొన్నిచోట్లైతే ఏకంగా ఫ్లడ్ లైట్స్ పెట్టి మరీ రాత్రంతా కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏకంగా 350 వరకూ బరులు ఏర్పాటైతే...తూర్పు గోదావరి జిల్లాలో 250 వరకూ కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. కోడిపందేళ్లో ఈసారి డిజిటల్ లావాదేవీలు నడిచాయి. ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. బరిని బట్టి..కోడిని బట్టి పందెం జరిగింది. డైరెక్ట్ పందేలు, బయటి పందేలు జోరందుకున్నాయి. కొన్ని బరుల్లో అయితే లక్ష రూపాయల్నించి పది లక్షల వరకూ పందేలు కాశారు. చిన్నబరుల్లో అయితే 5 వేల నుంచి 50 వేల వరకూ బెట్టింగ్ నడుస్తోంది. 


పండుగ (Sankranthi) మూడ్రోజులు కచ్చితంగా కోడి పందేలు నడుస్తాయి. కోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు సంప్రదాయపు ఆటలో నలిగిపోవల్సిందే. స్థానిక రాజకీయ నేతలపై గ్రామస్థుల ఒత్తిడి పైచేయిగా సాగుతోంది. ప్రతియేటా ఉన్నట్టే ఈసారి కూడా సాగింది. ఈసారి ప్రభుత్వం నుంచి పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో..భారీగా కోడి పందేలు సాగాయి. కోడి పందేల బరులకు ఆనుకుని..పేకాట, గుండాట శిబిరాలు భారీగా వెలిశాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో కూడా కోడి పందేలు భారీగా కొనసాగాయి. ఇతర రాష్ట్రాల్నించి కూడా పందెం రాయుళ్లు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే రెండు జిల్లాల్లో కలిపి 3 వందల కోట్ల వరకూ పందేలు జరిగినట్టు పక్కా సమాచారం. అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 450 కోట్ల వరకూ బెట్టింగ్ (Betting) సాగినట్టు తెలుస్తోంది. 


Also read: Raghurama Krishna Raju : జార్ఖండ్ వ్యక్తులతో నన్ను చంపేందుకు కుట్ర.. ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి