Raghurama Krishna Raju: జార్ఖండ్ వ్యక్తులతో నన్ను చంపేందుకు కుట్ర.. ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు

Raghurama Krishna Raju Sensational Allegations: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోపమొస్తే వ్యవస్థలను తీసేస్తారని, వ్యక్తులను లేకుండా చేస్తారని రఘురామ ఆరోపించారు. ఇటీవల గుంటూరులో టీడీపీ నేత దారుణ హత్యను రఘురామ ఈ సందర్భంగా గుర్తుచేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 09:05 PM IST
  • ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు
  • తనపై హత్యకు కుట్ర జరుగుతోందన్న ఎంపీ
  • జార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్లాన్ జరుగుతోందని ఆరోపణ
  • హత్య కుట్రపై ప్రధానికి లేఖ రాస్తానన్న ఎంపీ రఘురామ
Raghurama Krishna Raju: జార్ఖండ్ వ్యక్తులతో నన్ను చంపేందుకు కుట్ర.. ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు

Raghurama Krishna Raju Sensational Allegations: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకోసం జార్ఖండ్ నుంచి 20 మంది వ్యక్తులను రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాయబోతున్నానని... తనకు ఎవరెవరిపై అనుమానం ఉందో.. వారి పేర్లు అందులో పేర్కొనబోతున్నానని తెలిపారు. హత్య కుట్రపై విచారణ జరిపించాల్సిందిగా ప్రధానిని కోరుతానని స్పష్టం చేశారు. ఢిల్లీలో శుక్రవారం (జనవరి 14) మీడియాతో మాట్లాడిన సందర్భంగా రఘురామ (Raghurama Krishna Raju) ఈ సంచలన ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (CM YS Jagan) కోపమొస్తే వ్యవస్థలను తీసేస్తారని, వ్యక్తులను లేకుండా చేస్తారని రఘురామ ఆరోపించారు. ఇటీవల గుంటూరులో టీడీపీ నేత దారుణ హత్యను రఘురామ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలా ఇంకెంతమందిని లేకుండా చేస్తారని ప్రశ్నించిన రఘురామ... దీనికి 'సీఎం ఓం నమ:శివాయ స్కీమ్' అనే పేరు పెట్టుకుందామని ఎద్దేవా చేశారు.

ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్ట్ వ్యవహారంలో లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ స్పందించిన తీరును రఘురామ ప్రశంసించారు. సంజయ్ అరెస్ట్ వ్యవహారంలో లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ అప్పటికప్పుడు కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసిందన్నారు. అదే తరహాలో తన వ్యవహారంలోనూ లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ స్పందించాలన్నారు. గతేడాది జూన్ 2 అర్ధరాత్రి ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, మరో నలుగురు అధికారులు తన గదిలోకి దూరి తనకు దేహశుద్ది చేశారని.. ఆ ఘటనపై విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరుతున్నట్లు తెలిపారు. గతంలో తానిచ్చిన ప్రివిలేజ్ పిటిషన్‌పై ఇప్పటివరకూ ఎటువంటి స్పందన లేదన్నారు.

జగనన్న గోరుముద్ద పథకం గురించి ప్రస్తావిస్తూ... ఇకపై రాష్ట్రంలో ఆ పథకం కొనసాగదన్నారు రఘురామ. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో జగనన్న (CM YS Jagan) పథకాలు కొనసాగించలేరని అన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాయగా.. ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Also Read: Lesbian Marriage : ఇంట్లో నుంచి పారిపోయి... పెళ్లితో ఒక్కటైన ఆ లెస్బియన్ జంట...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News