Complaint Filed on Dog at Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో ఇంటింటికి స్టిక్కర్లను అతికించే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు అలాగే రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ పదవులు పొందిన వారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్ను ఇంటింటికి అతికించే ప్రయత్నం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా ఒక కుక్క ఒక ఇంటి ముందున్న ఈ స్టిక్కర్ను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో షేర్ చేసి ఇప్పుడు కుక్క మీద కూడా కేసు పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసిన విధంగానే ఇప్పుడు ఆ కుక్క మీద ఏపీలో ఒక పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ఒక వీడియోని టిడిపి నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


తాము విజయవాడ రూరల్ నున్న పోలీస్ స్టేషన్లో ఒక కుక్క మీద ఫిర్యాదు చేశామని ఎందుకంటే కుక్క జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లను పీకేస్తోందని ఈ విషయాన్ని వీడియోతో సహా తన ఫోన్ లో రికార్డు అయితే దీనిని పోలీసు అధికారులకు సమర్పించామని ఫిర్యాదు చేసిన మహిళ చెబుతోంది. ఏపీ రాష్ట్రంలో ఉన్న ఆరు కోట్ల మంది, జనాభా నాలుగు కోట్ల మంది ఓటర్లు చాలా బాధతో ఉన్నారు దిగ్భ్రాంతికి గురయ్యారని ఆమె పేర్కొన్నారు.


ఇదీ చదవండి: Rakul Preet Photos: బ్లాక్ బాడీ కాన్ డ్రెస్సులో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..తట్టుకోవడం కష్టమే సుమీ!


ఇప్పటివరకు లేనివిధంగా 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించిన జగన్ మోహన్ రెడ్డిని కుక్క కూడా అవమానించడం చాలా బాధాకరమైన విషయం అని ఆమె పేర్కొన్నారు. తాము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన మహిళలము అని చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తామని, తాము ఎంతగానో గౌరవప్రదంగా చూసుకునే ఆయన స్టిక్కర్ చింపడం వల్ల కుక్క మీద ఫిర్యాదు చేసేందుకు ఇక్కడికి వచ్చామని ఆమె మీడియాతో మాట్లాడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది..



వైయస్ జగన్ కి ఎక్కడా గౌరవం తగ్గకూడదని, ఎక్కడ ఆయనను కించపరిచే విధంగా చేయకూడదని కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నకి ఇది ఎంత నామోషి? అందుకే ఇది మళ్ళీ మళ్ళీ పునరావృత్తం కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని అన్నారు. ఇక నున్న సీఐ ఈ విషయం మీద ఫిర్యాదు స్వీకరించారని వెంటనే కుక్కని అదుపులోకి తీసుకుని ఆ కుక్క అలా చేయడానికి వెనుక ప్రోద్బలం ఎవరిదో తెలుసుకోవాలని ఆమె అన్నారు.


ఆ కుక్కను మాత్రమే కాదు ఆ కుక్క వెనకాల ఉండి ఈ పని చేయించిన కుక్కల్ని కూడా వదిలే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. అయితే ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆమె చుట్టుపక్కల ఉన్న మహిళలు నవ్వుకుంటున్న పరిస్థితులు చూస్తే నిజంగానే వారు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారా? లేకపోతే ఎవరైనా కావాలని ఇలా మహిళలతో మాట్లాడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఈ విషయం మీద పోలీసులు అధికారికంగా ఏదైనా ప్రెస్ నోట్ విడుదల చేస్తే తప్ప నిజం ఏమిటి అనే విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.


ఇదీ చదవండి: Sree Leela Fees: శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా?.. వామ్మో అనాల్సిందే



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook