విశాఖపట్నంలో మిస్ వైజాగ్  2017 పేరిట నిర్వహిస్తున్న అందాల పోటీలను బహిష్కరించాలని స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. 1986 యాక్టు ప్రకారం మహిళల చేత అంగాంగ ప్రదర్శన చేయించడం చట్టరీత్యా నేరమని.. అలాంటి ప్రదర్శనలను నిర్వహిస్తున్న నిర్వాహకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు తెలిపారు.


ఈ క్రమంలో అందాల పోటీలను నిలిపి వేయాలని కోరుతూ.. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ విషయమై స్పందించిన మంత్రి, పోటీకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ తెలుసుకొని.. ఒకవేళ అవి మహిళలను కించపరిచే విధంగా ఉంటే తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మధ్యకాలంలో అందాల పోటీల పేరుతో అమ్మాయిలు చేత అసభ్య ప్రదర్శనలు చేయిస్తున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు తెలియజేశారు.