అది సాధ్యం కాని అంశం: కాంగ్రెస్ నేత జైరాం రమేష్
రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. 1953లో కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలనుకున్నా సాధ్యం కాలేదని వివరించారు. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోందని, ఏపీకి మూడు రాజధానులు అసాధ్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. 1953లో కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలనుకున్నా సాధ్యం కాలేదని వివరించారు. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోందని, ఏపీకి మూడు రాజధానులు అసాధ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఒకచోట, హైకోర్టు మరోచోట, అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంకో చోట ఏర్పాటు చేయడం వీలుకాదని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని మించింది లేదని జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. బోస్టన్ కమిటీకి తలాతోక ఏమైనా ఉందా.. కమిటీ ఎప్పుడు వేశారో కూడా స్పష్టత లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కోరి 29వేల మంది రైతులు భూములు ఇచ్చారని.. నేడు వారు మనోవేదనతో ఉన్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా నాటకాలు ఆపాలంటూ ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..