AP Rains: గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ వాసులను వర్షాలు ఒదలడం లేదు. నిన్న ఆదివారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసాయి. సోమవారం (ఈ రోజు) ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు  కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది సమాచారం.  
 
వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు  ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.  ఈ నెల 7న ఒకటి ఏర్పడగా.. అది తీవ్ర అల్పపీడనంగా బలపడింది.. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు  పడ్డాయి. ఉమ్మడి నెల్లూరు,చిత్తూరు, తిరుపతి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. మరోవైపు 17న అండమాన్‌ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని మరో అంచనా వేసింది వాతావరణ కేంద్రం. ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు APలో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 12  డిగ్రీల కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా చలి తీవ్రత కనిపిస్తోంది. చలి, పొగమంచు దెబ్బకు ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఏజెన్సీలో పొగమంచు కమ్మేస్తోంది. మరీ దారుణంగా సాయంత్రం మూడు, నాలుగు గంటల నుంచి చలి ప్రభావం కనిపిస్తోందంటున్నారు.


ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..


ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.