TTD Declaration: తిరుమల డిక్లరేషన్ పై పెరుగుతున్న వివాదం
తిరుమల దేవస్థానం డిక్లరేషన్ పై వివాదం రోజురోజుకూ పెరుగుతుంది. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే దానిపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎక్కడా లేని డిక్లరేషన్ ఇక్కడెందుకని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల దేవస్థానం డిక్లరేషన్ ( Tirumala Devasthanam Declaration ) పై వివాదం రోజురోజుకూ పెరుగుతుంది. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలావద్దా అనే దానిపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎక్కడా లేని డిక్లరేషన్ ఇక్కడెందుకని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ( Ap ) లో మత పరమైన అంశాలపై ప్రతిపక్షాల రాద్ధాంతం ఇంకా కొనసాగుతోంది. నిన్నటి వరకూ అంతర్వేది ఆలయ రథం ( Antarved temple chariot ) దగ్దం విషయంలో వివాదం విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుమల విషయంలో జరుగుతోంది. దీనికి కారణం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సాంప్రదాయం ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) వెళ్లాల్సి ఉంది. సీఎం హోదాల జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ( TTD Chairman yv subbareddy ) చెప్పినప్పట్నించి వివాదం ప్రారంభమైంది. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ప్రతపక్షాలు రాద్ధాంతం సృష్టించాయి.
మరోవైపు మంత్రి కొడాలి నాని ( Minister kodali nani ) కాస్త ఘాటుగానే ఈ విషయంపై స్పందించారు. మసీదులు, చర్చిల్లో లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకని..దీనిపై చర్చించాల్సిన అవసరముందంటూ కొత్త చర్చకు తెర తీశారు. గతంలో చాలామంది ముఖ్యమంత్రుల పర్యటనలో అమలు చేయని డిక్లరేషన్ ను ఇప్పుడెందుకు అమలు చేయాలని ప్రశ్నించారు కొడాలి నాని. దేశంలో ఎక్కడా ఏ ఆలయంలో కూడా డిక్లరేషన్ లేదని గుర్తు చేశారు. మంత్రి నాని వ్యాఖ్యలతో దుమారం మరికాస్త పెరిగింది.
ఇప్పుడు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఓవీ రమణ కూడా డిక్లరేషన్ విధానంపై ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ ఆలయంలో కూడా డిక్లరేషన్ లేనప్పుడు తిరుమలలోనే ఎందుకుని ప్రశ్నించారు. వైకుంఠం ముందు కూడా ఓ నోటీసు బోర్డు ఉందని గుర్తు చేశారు. ఆ నోటీసు బోర్డులో డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనేది భక్తుల ఇష్టంగా ఉందని చెప్పారు. ఇలాంటి విషయాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మంత్రి నానిపై విమర్శలు చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై పీఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
మరోవైపు తిరుమల ( Tirumala ) శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై నుంచి ఊరేగింపుగా హిందూ ధర్మర్ధ సమితి సంస్థ ఆధ్వర్యంలో తిరుమలకు గొడుగులు చేరుకున్నాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డిలకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ జి. గోపాల్ గొడుగులను అందజేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి గొడుగులను అలంకరించనున్నారు. మొత్తం 11 గొడుగులను కానుకగా అందించగా, 9 గొడుగుల్ని తిరుమల శ్రీవారికి..2 గొడుగుల్ని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వినియోగించనున్నారు. Also read: YS Jagan Delhi Tour: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్..