Coronavirus alert: కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశమంతా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి. ఈ నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని.. వ్యాక్సినేషన్(Vaccination) వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లోనూ, 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. 


మరోవైపు తూర్పు గోదావరి రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ (Tirumala College) లో భారీగా కరోనా కేసులు నమోదవడంతో మంత్రి ఆళ్ల నాని (Minister Alla nani) స్పందించారు. ఈ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా వైరస్ సోకిన 163 మంది విద్యార్థులను అదే కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి వైద్య సదుపాయం కల్పించామని మంత్రి చెప్పారు. తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామన్నారు. కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్‌కి తరలించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.


కాకినాడ, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజమండ్రి ప్రాంతాల్లో 41 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50 మీటర్ల దూరంలో కంటోన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశామన్నారు. కరోనా సోకిన బాధితులను 24 గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నామని..జిల్లాలో 35 కంటోన్మెంట్ జోన్ (Containment zone)‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుమల జూనియర్ కాలేజీలో 4 వందల మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు చేయనున్నారు. 


Also read: New Sand Policy: కొత్త ఇసుక పాలసీతో ప్రజలకు ప్రయోజనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook