ఏపీలో భారీగా కరోనా కేసులు.. కోయంబేడుతో లింకులు!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచీ ఏపీలో భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
Andhra Pradesh COVID19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం ఏపీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (AP Corona Positive Cases) 6,456కి చేరింది. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో మరొకరు కోవిడ్19 బారిన పడి మరణించగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 86కి చేరింది. ప్రైవేట్‌గా కరోనా టెస్టులకు ధర నిర్ణయించిన ప్రభుత్వం
గడిచిన 24 గంటల్లో 15,173 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 304 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో రాష్ట్రంలో ఉన్నవారిలో 246 కేసులు రాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 58 కోవిడ్ కేసులు నిర్ధారించారు. అయితే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న తమిళనాడులోని కోయంబేడు ప్రాంతం నుంచి వచ్చినవారిలో చాలా వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా కరోనా కేసులు, డిశ్ఛార్జ్ వివరాలు తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్
ఏపీలో ఇప్పటివరకూ 2,770 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ కాగా, 2,231 మంది చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 210 కరోనా కేసులుండగా, ప్రస్తుతం 187 యాక్టీవ్ కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 1159 కేసులు నమోదు కాగా, దాదాపు సగం మంది కోలుకున్నారు. ప్రస్తుతం 567 యాక్టీవ్ కేసులున్నాయి. తాజాగా 22 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ
‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’