ప్రైవేట్‌గా కరోనా టెస్టులకు ధర నిర్ణయించిన ప్రభుత్వం

కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్19 టెస్టులు జరిపిస్తున్నామని, తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా టెస్టులకు ధర (CoronaVirus Test Cost) నిర్ణయించినట్లు తెలిపారు.

Last Updated : Jun 15, 2020, 02:28 PM IST
ప్రైవేట్‌గా కరోనా టెస్టులకు ధర నిర్ణయించిన ప్రభుత్వం

CoronaVirus Test Cost in Telangana | తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ (సామాజిక వ్యాప్తి) జరగలేదని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ చెప్పిన అన్ని విషయాలను పాటించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరిగాయన్నారు. కరోనా కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ టెస్ట్ సెంటర్లలో కరోనా పరీక్షలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.  ఒక్కరోజులో 11,502 కరోనా కేసులు, 325 మంది మృతి

ప్రైవేట్ హాస్పిటల్, టెస్ట్ సెంటర్లలో ఒక్కో కరోనా పరీక్షకు (CoronaVirus Test Cost) రూ.2200 వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం లక్షణాలు కనిపించిన వారకే టెస్టులు చేయాలని సూచించిటనట్లు తెలిపారు. ఒకవేళ వారికి కోవిడ్19 పాజిటివ్‌గా గుర్తించడి ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తి నుంచి రోజుకు రూ.4000, వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స అందిస్తే రూ. 7,500, వెంటిలేటర్ మీద ఉండే వారికి రోజుకు రూ.9000 వసూలు చేయాలని సూచించినట్లు వెల్లడించారు.  మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

ప్రస్తుతానికి ప్రతిరోజూ 7,500 మందికి కరోనా టెస్టులు చేసే సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేట్ టెస్టు కేంద్రాలు తమకు అన్ని శాంపిల్స్ వివరాలు, కోవిడ్19 పరీక్షల ఫలితాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ
‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’

Trending News