AP Corona Positive Cases |  గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 2,592 మందికి కరోనా సోకగా, మిగతా 10 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 40,646కు చేరుకున్నాయి.  ప్రియుడితో లేడీ కానిస్టేబుల్ క్వారంటైన్.. ఊహించని ట్విస్ట్ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 20,298 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 19,814 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 42  మంది కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 534కి చేరింది. India: 10 లక్షల కరోనా కేసులు, 25వేల మరణాలు


తాజాగా అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కృష్ణాలో ఒక్కరు కరోనా(COVID19) బారిన పడి చనిపోయారు. అదే సమయంలో 837 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  మోడల్ Shweta Mehta Hot Photos వైరల్


నేటివరకు రాష్ట్రంలో మొత్తం 12,60,512 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 37,751 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,461 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 434 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 17న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.   సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..