AP Covid-19 Cases updates : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 9వేలకు పైగానే కేసులు నమోదవుతుండగా.. నిన్న కొంచెం తగ్గాయి. గత 24గంటల్లో 7,895 కరోనా కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) ఆదివారం సాయంత్రం వెల్లడించింది. దీంతోపాటు 93 మంది మరణించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు పెరగగా.. ఇప్పటివరకు 3,282 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. Also read: Narendra Modi: నెమళ్లకు ఆహారం అందించిన ప్రధాని.. వీడియో వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,60,087 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 46,712 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..


[[{"fid":"191370","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ap corona bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ap corona bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"}},"link_text":false,"attributes":{"alt":"ap corona bulletin","title":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు","class":"media-element file-default","data-delta":"1"}}]]


 Also read: JEE-NEET Exams: విద్యార్థుల మ‌న్ కీ బాత్ వినండి: రాహుల్ గాంధీ