వైజాగ్: విశాఖపట్నంలో మరో కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసు (Coronavirus in Vizag) వెలుగుచూసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus positive cases in AP) 12కు చేరింది. ఈ నెల 17న యూరప్ దేశాల నుంచి వచ్చిన ఓ విద్యార్ధి నుంచి కొత్త వ్యక్తికి కరోనావైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. కొత్తగా కరోనావైరస్ సోకిన వారి కుటుంబసభ్యుల రక్త నమూనాలను సైతం కోవిడ్ టెస్టుకు (Coronavirus test) పంపించినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కడి ప్రజలు అక్కడే ఉంటూ కేంద్రం విధించిన లాక్‌డౌన్‌కి సహకరించాలని.. అప్పుడే కరోనావైరస్ కాంటాక్ట్ కేసులను గుర్తించడానికి వీలుంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ వాసులకు విజ్ఞప్తి చేసిన మరునాడే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.



ఇదిలావుంటే దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 724కు చేరుకుంది. శుక్రవారం సైతం మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 18కి చేరుకోగా ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 23,000 దాటడం ఆందోళన రేకెత్తిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..