Corona Positive Cases in AP | కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఓ బాధితురాలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. అధికారులు, ఆస్పత్పి నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి... జిల్లాలోని జగ్గయ్యపేటకు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రికి వెళ్తే జ్వరమని చెప్పి టాబ్లెట్లు రాసి పంపారు. అయితే కరోనా సోకిందేమోనన్న అనుమానంతో జులై6న కోవిడ్19 టెస్టులు చేపించుకుంది. ఏపీలో కరోనా పంజా.. ఒకేరోజు 43 మంది మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జులై 12న టెస్టుల ఫలితాలలో ఆమెకు కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. 108లో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. బెడ్‌లు ఖాళీగా లేవని, హోం క్వారంటైన్ ఉండాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారంటూ కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తల్లిని ప్రైవేట్ వాహనంలో ఇంటికి తీసుకెళ్లేందుకు కుమారుడు యత్నించగా ఫలితం లేకపోయింది. దీంతో ఆ వృద్ధురాలు రాత్రంతా ఆస్పత్రి ఆవరణలోనే గడపాల్సి వచ్చింది. మరుసటిరోజు ఉదయం బస్టాండ్‌కు వెళ్లి జగ్గయ్యపేట బస్సెక్కి ఇంటికి చేరుకుంది. ఏపీ, కర్ణాటకల మధ్య బస్సు సర్వీసుల నిలిపివేత


కరోనా సోకిందంటూ అంబులెన్స్‌లో విజయవాడకు తీసుకెళ్లిన వృద్ధురాలు ఆర్టీసీ బస్సు(APSRTC)లో ప్రయాణించి తిరిగి ఇంటికి రావడంపై స్థానికులు కంగుతిన్నారు. ఇరుగుపొరుగు నుంచి సమాచారం అందుకున్న అధికారులు సచివాలయ, 108 సిబ్బందిని మళ్లీ పంపించారు. ఆమెను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడంతో ఆ సిబ్బందితో బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు గొడవకు దిగారు. ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఇంటికి ఎందుకు పంపించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో బెడ్ ఖాళీగా లేదని, వేచి చూడాలని చెప్పగా బాధితురాలు ఇంటికి వచ్చేసిందని ఎమ్మార్వో చెప్పడం గమనార్హం.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..