కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో తాజాగా కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే మరోసారి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ఏపీ ఆరోగ్య శాఖ ( Ap Health Department ) తాజాగా గైడ్ లైన్స్ జారీ చేసింది. యాంటిజెన్ ( Antigen tests ) పరీక్షలు, ఆర్టీ-పీసీఆర్ ( RT-PCR Tests ) , రియల్ టైమ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలుగా కేటగరైజ్ చేసింది. కరోనా అనుమానితుల పరీక్షల కోసం యాంటిజెన్ కిట్లను వినియోగించాలని కోరుతూ..జిల్లాకు 20 వేల కిట్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. Also read: Corona Effect: తిరుపతిలో నేటి నుంచి కొత్త రూల్


యాంటిజెన్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే వెంటనే చికిత్స అందించాలని...సదరు రోగిని ఐసోలేట్ చేయాలని సూచించింది. లక్షణాలు కన్పిస్తున్నా...యాంటిజెన్ లో నెగెటివ్ అని తేలితే ఆర్టీ-పీసీఆర్ ( Rt-pcr tests ) పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఇందులో కూడా నెగెటిన్ అని తేలితే రియల్ టైమ్ లో ఆర్టీ-పీసీఆర్ (Realtime Rt-pcr test ) చేయించాలని సూచించింది. ఇక అత్యంత రిస్క్ కలిగిన ప్రాంతాలు, కంటెయిన్మెంట్ జోన్లలో తరచూ పరీక్షలు నిర్వహించాలని సంబంధిత జిల్లా యంత్రాంగాలకు ఆదేశించింది. గర్భిణీ స్త్రీలు, ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సకు చేరే రోగులలకు ఈ కిట్లు తప్పనిసరిగా వాడాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ దాదాపు 11 లక్షల 70 వేల కోవిడ్ 19 వైరస్ నిర్ధారణ పరీక్షలు ( Covid19 virus tests ) నిర్వహించారు. 15 వేలకు పైగా కోలుకున్నారు. Also read: Covid 19: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు