Cyclone Alert: పశ్చిమ తీరం నుంచి తౌక్టే తుపాను తీరం దాటిందో లేదో బంగాళాఖాతంలో మరో తుపాను సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని..క్రమంగా తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తౌక్టే తుపాను(Tauktae Cyclone) భీభత్సం గురించి మర్చిపోకముందే మరో తుపాను సిద్ధమవుతోంది. ఈసారి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుంది. ఈ నెల 23 నాటికి బంగాళాఖాతం(Bay of Bengal) లో అల్పపీడనం ఏర్పడి..క్రమంగా బలపడి వాయుగుండంగా..తరువాత తుపానుగా మారవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం తుపాను సముద్రంలోనే బలపడి..ఆపై దిశ మార్చుకుని ఉత్తర కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనించనుంది. పశ్చిమ బెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటవచ్చు. ఆంధ్రప్రదేశ్ తీరానికి 2 వందల నుంచి 3 వందల కిలోమీటర్ల సమీపానికి వచ్చేసరికి దిశ మార్చుకునే అవకాశముందని వాతావరణ శాఖ (IMD) నిపుణులు చెబుతున్నారు. తుపాను(Cyclone) ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల తరువాత రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల ఆగమనానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు.


మరోవైపు ఈ నెల 21వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరో మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.


Also read: AP lockdown timings మార్పు వార్తల్లో నిజం లేదు: AP govt


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook