Jawad Cyclone Ahead: బంగాళాఖాతంలో మరో తుపాను పొంచి ఉంది. మరోవారం రోజుల్లో రానున్న తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో(Bay of Bengal)అండమాన్ నికోబార్ దీవుల పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారనుందని తెలుస్తోంది. అండమాన్ పరిసర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులు ఆవహించి ఉన్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి 15 వందల మీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా అరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకూ విస్తరించింది. ఫలితంగా రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల మరో నాలుగురోజుల్లో ఇంకా బలపడి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ(IMD)వెల్లడించింది. తుపానుగా మారితే జవాద్‌గా నామకరణం(Jawad Cyclone)చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది. బర్మా నుంచి తిరిగి దిశ మార్చుకుని దక్షిణ ఒడిశావైపుకు రానుందని ఐఎండీ వెల్లడించింది. తుపాను ప్రభావమంతా ఒడిశాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదిలా ఉండగా మరో రెండ్రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయి. ఈ నెల 17న తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు కాస్త ఆలస్యంగా అంటే ఈ నెల 23 లేదా 24 తేదీల్లో రానున్నాయి.


Also read: India Space Association: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు ఐఎస్‌పీఏ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook