India Space Association: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు ఐఎస్‌పీఏ ప్రారంభం

India Space Association: అంతరిక్షంలో ఇండియా సరికొత్త శకం ప్రారంభం కానుంది. భారత స్పేస్ అసోసియేషన్ స్థూలంగా ఐఎస్‌పీఏను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అసలు ఐఎస్‌పీఏ ప్రాజెక్టు లక్ష్యాలేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2021, 11:00 AM IST
  • భారత అంతరిక్షరంగంలో సరికొత్త శకం ప్రారంభం
  • భారత స్పేస్ అసోసియేషన్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • అంతరిక్ష పరిశ్రమలో సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలతో ముందుకు వెళ్లనున్న సంస్థ
India Space Association: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు ఐఎస్‌పీఏ ప్రారంభం

India Space Association: అంతరిక్షంలో ఇండియా సరికొత్త శకం ప్రారంభం కానుంది. భారత స్పేస్ అసోసియేషన్ స్థూలంగా ఐఎస్‌పీఏను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అసలు ఐఎస్‌పీఏ ప్రాజెక్టు లక్ష్యాలేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

భారత అంతరిక్షరంగంలో(Indian Space Sector)మరో ప్రయోగం జరగనుంది. భారత స్పేస్ అసోసియేషన్‌ను ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో ప్రతినిధులతో ఇవాళ మోదీ భేటీ కానున్నారు. ఐఎస్‌పీ‌ఏ (ISPA)అనేది భారత అంతరిక్షరంగం ప్రాముఖ్యతను తెలిపే అత్యున్నత సంస్థ. ఐఎస్‌పీఏ న్యాయపరమైన విధానాల్నిషేర్ హోల్డర్ సంస్థలతో పంచుకోనుంది. దేశంలోని అంతిరక్ష పరిశ్రమలో వివిధ సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలతో ముందుకు రానుంది. భారత స్పేస్ అసోసియేషన్ (Indian Space Association)అనేది ఆత్మ నిర్భర భారత్‌పై దృష్టి సారించేలా ఉండనుంది. దేశాన్ని స్వయంశక్తితో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగానే కాకుండా..అంతరిక్షరంగంలో కీలకపాత్ర పోషించనుందని ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు. ఐఎస్‌పీఏ వ్యవస్థాపక కంపెనీల్లో ఎల్‌అండ్‌టి, నెల్కో, వన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్ మై ఇండియా, వాల్ చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు..గోద్రెజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా-బీఎస్‌టి ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బిఈఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా వంటి ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి.

అంతరిక్షరంగంలో గత కొన్నేళ్లుగా ఇండియా వినూత్న ప్రయోగాలు, సక్సెస్ సాధించింది. లెక్కకు మించిన ప్రయోగాలు, ప్రాజెక్టుల్ని ఇస్రో(ISRO)చేపట్టింది. కోవిడ్ 19 ప్రభావంతో కొన్ని ఆలస్యమయ్యాయి. 2020లో నిర్వహించాల్సిన దేశంలోని తొలి సోలార్ మిషన్ కోవిడ్ సంక్షోభం కారణంగా ఆలస్యమై..2022 మూడవ త్రైమాసికంలో నిర్వహణకు సిద్ధమవుతోంది. దేశపు రెండవ స్పేస్ అబ్జర్వేటరీ ఎక్స్‌పోశాట్‌ను వచ్చే ఏడాది ఇస్రో ప్రయోగించనుంది. కరోనా సంక్షోభానికి ముందు 2020-21 సంవత్సరంలో 20 ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో తొలి మానవ రహిత గగన్‌యాన్ (Gaganyan)మిషన్ ఉంది. 20222 లేదా 2023లో గగన్‌యాన్ చేపట్టే అవకాశాలున్నాయి.

Also read: Tamilnadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు, మళ్లీ వస్తోన్న చిన్నమ్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News