Purandeswari on NTR district: ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను విభజిస్తూ.. కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా..కృష్ణా జిల్లాను (Krishna District) రెండు భాగాలుగా విభజించి విజయవాడ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా (NTR district) నామకరణం చేస్తున్నట్లు జగన్ సర్కారు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటివరకు టీడీపీ నేత‌లు గానీ, నంద‌మూరి వారసులు గానీ స్పందించలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ఈ ఆంశంపై ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రి (Daggubati Purandeswari ) మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ మహనీయుడు నందమూరి తారకరామారావు గారు పుట్టిన జిల్లాకు ‘ఎన్టీఆర్‌ జిల్లా’ అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా స్వాగతిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని అభిప్రాయపడ్డారు. ‘జై ఎన్టీఆర్’ అంటూ ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.




Also Read: AP New Districts: ఆ జిల్లాలోకి మేము ఎందుకు వెళ్లాలి? జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి!


ఏపీలో  కొత్త జిల్లాలు (new districts in ap) ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉగాది నుంచి ఈ కొత్త జిల్లాలు అమలులోకి రానున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి