AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అలాగే గెజిట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ (AP Government) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రాంతాల్లో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని రెవెన్యూ డివిజన్ల రద్దుపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో (Reorganization of Districts in AP) భాగంగా ప్రస్తుతం ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను, వేరే జిల్లా పరిధిలోకి తీసుకురాబోతున్నారంటూ కొన్నిచోట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్స్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం నంద్యాల లోక్‌సభ స్థానం (Nandyala) పరిధిలో ఉన్న పాణ్యం అసెంబ్లీ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యంతో పాటు గడివేముల మండలాల వారు వ్యతిరేకిస్తున్నారు.అలాగే పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కర్నూలుకు (Kurnool) దగ్గరలో, ఇక పాణ్యం, గడివేముల అయితే నంద్యాలకు సమీపంలో ఉంటాయి. జిల్లా విభజన జరిగితే కల్లూరు, ఓర్వకల్లు మండలాలను కర్నూలు డిస్ట్రిక్ట్‌లో కలపాలంటూ అక్కడి వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో వారి ఆకాంక్ష నెరవేరింది. కానీ పాణ్యం, గడివేముల మండలాల వారికి ఇది చాలా ఇబ్బందిగా మారింది. నంద్యాలకు చాలా సమీపంలో ఉండే తమను చాలా దూరంలో ఉండే కర్నూలు జిల్లాలో కలపడమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడి ప్రజలు.
ఇక రాజంపేటను (Rajampet) జిల్లా కేంద్రం చేయకపోవడంపై రాజంపేట మునిసిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందన్నారు. రాయచోటిని, మదనపల్లెని కలిపి వేరే జిల్లాగా చేసుకోవాలంటూ మర్రి రవి (Marri Ravi) అన్నారు. అలాగే ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడంతో పాటు కందుకూరు అసెంబ్లీ స్థానాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడంపై కూడా ప్రజాసంఘాలు నిరసనకు రంగం సిద్ధం చేశాయి.
ఇక మార్కాపురం (Markapur) కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటూ ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంత ప్రజల డిమాండ్. కనిగిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఏర్పాటు కాబోయే బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లపై కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
గుంటూరు జిల్లాలోని (Guntur District) పెదకూరపాడు అసెంబ్లీ స్థానాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడంపై కూడా స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది.విజయవాడకు (Vijayawada) దగ్గరలో ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్ని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాలో చేర్చడంపై కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండింటినీ ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలంటూ అక్కడి వారి డిమాండ్.
శ్రీకాకుళం, పాలకొండ, పలాస కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలనే వాదన తెరపైకి వచ్చింది. అరకు (Araku) లోక్‌సభ స్థానం చాలా పెద్దదిగా ఉండడం వల్ల దాన్ని మూడు జిల్లాలుగా చేయాలని వాదనను కూడా కొందరు తీసుకొచ్చారు.
Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్‌కి పడిపోయిన మెగా హీరో.. త్వరలోనే!!
అయితే ప్రజాభిప్రాయ సేకరణ మేరకే 26 కొత్త జిల్లాలను (AP New Districts) ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ ప్రభుత్వం ఇది వరకే స్పష్టతను ఇచ్చింది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయ సేకరణ ఉంటుంది.
Also Read: Maharashtra: విషాదం... ట్రక్కు పడి ముగ్గురు చిన్నారులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook