హైదరాబాద్: బీజేపీ సీనియర్  నేత బండారు దత్తత్రేయ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ  ఎన్నికల తర్వాత కచ్చితంగా ఎన్డీయే అధికారంలో వస్తుందన్నారు. ఎన్డీయేకు  కొన్ని పార్టీలు బహిరంగ మద్దతు ప్రకటిస్తుంటే.. మరికొందరు ఎన్నికల తర్వాత జాయిన్ అవుతారని జోస్యం చెప్పారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ ఫ్రంట్ సాధ్యం కాదు..
కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని..ఎన్నికల తర్వాత జగన్ తో సహా కేసీఆర్ లిస్ట్ లో ఉన్నవాదరంరూ ఎన్డీయే లో భాగస్వామ్యం అవుతారని జోస్యం చెప్పారు.  ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న టీడీపీ సహా ప్రాంతీయ రాజకీయ పక్షాలకు ఎన్నికలు పూర్తయ్యాక ఎన్డీయే మొగ్గుచూపే అవాకశముందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. 


ప్రాంతీయ పార్టీలకు ఎన్డీయేనే దిక్కు
ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని ప్రస్తావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..తమకు 120 నుంచి 150 ఎంపీల మద్దతు ఉందని.. ఎన్నికల తర్వాత వైసీపీ సహా బీజేడీ, ఎస్పీ,బీఎస్పీల లాంటి పార్టీలు తమతో కలిసి వస్తానయని చెబున్నారు. ఈ నేపథ్యంలో దత్తాత్రయే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఇది రాజకీయ ఎత్తుగడ..


ఎన్నికలు సమీపిస్తున్న నేపత్యంలో రాజకీయ ఎత్తుగడలో భాగంగా దత్తాత్రేయ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ సమీకరణలు అంచనా వేసి దత్తాత్రేయ ఈ వ్యాఖలు చేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.