దావూద్ పాక్‌లోనే ఉన్నాడు ; పోలీసు విచారణలో అతని సోదరుడు వెల్లడి
మొస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం గురించి కీలక సమాచారం అందింది. దావుద్ పాక్‌లోను ఉన్నట్లు ...బెదిరింపులకు కేసులో అరెస్ట్ అయిన దావుద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ పోలీసులకు తెలిపాడు. నిఘా వర్గాలు, థానే క్రైం బ్రాంచీ అధికారులు సంయుక్తంగా జరిపిన విచారణలో ఇక్బాల్ కస్కర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. విచారణ సందర్భంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఇక్బాల్ కస్కర్ సమాధానం ఇస్తూ .. దావుద్ ప్రస్తుతం పాక్ లోని కరాచీలో తలదాచుకున్నాడని కస్కర్ వివరించాడు. అయితే దావుద్ తన బంధువులకు..స్నేహితులకు ఫోన్లు మాట్లాడటడని వివరించాడు. ఇటీవల కాలంలో దావుద్ తో కలిసి ఉంటున్న మరోసోదరుడు అనీస్ ఇబ్రహీంతో తాను కొన్నిసార్లు మాట్లాడినట్లు కస్కర్ వివరించాడు. దావుద్ పేరు చెప్పి కస్కర్ ..ముంబయిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు..ఇటీవల ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పాక్ నిజస్వరూపం మరోసారి బట్టబయలు..
1993 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్.. భారత్ నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. దావుద్‌ను పాక్ అశ్రయమిచ్చింది. దావుద్ ను తమకు అప్పగించాలని పదేపదే భారత ప్రభుత్వం పాక్‌కు విజ్ఞప్తులు చేసినా కుంటి సాకులు చెబుతోంది తప్పితే.. అప్పగించడానికి ముందుకు రాలేదు. అదేమంటే దావూద్ తమ దేశంలో ఉన్నట్లు ఆధారాలు చూపించాలని చెబుతోంది. తాజాగా దావుద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ స్టేట్ మెంట్ తో పాక్ అబద్దాల కోరని ..నేరగాళ్లు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశంమని ప్రపంచానికి తెలిసివచ్చింది.