ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో  కాళేశ్వరం రగడ నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రాజెక్టు అంశం పైన ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు మ‌ధ్య ఆస‌క్తి క‌ర చ‌ర్చ సాగింది.ఇరువురి మధ్య మాటకు మాట పెరిగి మాటల యుద్ధం సాగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్చ మొదలైందిలా...
ఉదయం ప్రశ్నోత్తారాల సమయంలో మంత్రి అనిల్ పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి వివరిస్తుండగా అదే సమయంలో  టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు జోక్యం చేసుకొని తెలంగాణకు సంబందించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఆ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేసారు కదా... మరి ఇప్పుడు సీఎం అయిన త‌రువాత జగన్ ప్రారంభోత్స‌వానికి ఎలా వెళ్లార‌ని ప్రశ్నించారు.


జగన్ వివరణ ఇదే.
కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కావ‌టం పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సభలో సీఎం జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు తాను వెళ్లినా..వెళ్ల‌కున్నా ఆరంభం అవుతుంద‌ని పేర్కొన్నారు. పక్కరాష్ట్రానికి  చెందిన సీఎం హోదాలో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి చేశారనే విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఒక వేళ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏపీకి అన్యాయం జరుగుతుందని భావించినట్లయితే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ ప్రాజెక్టు  క‌డుతుంటే ఎందుకు ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని జగన్ ఎదురు ప్రశ్న వేశారు. 


చంద్రబాబు రియాక్షన్ ఇదే
జగన్ విమర్శలకు చంద్ర‌బాబు సైతం ఘాటు గానే స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపీ, తెలంగాణ.. భారత్‌-పాక్ మాదిరిగా మారుతాయని అప్పట్లో జగనే అన్నారు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని వెనకేసుకేసు రావడం ఏంటని ప్రశ్నించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి మాట్లాడుతూ జగన్, కేసీఆర్ మ‌ధ్య జరిగే ఎలాంటి ఒప్పందం అయినా భావి త‌రాల‌కు న‌ష్టం జ‌రిగేలా ఉండ‌కూడ‌ద‌ని.. వాటి పైన చ‌ర్చ జ‌రిపిన ఆమోదం తీసుకోవాల‌ని సూచించారు. ఇప్పుడు కాళేశ్వరం ఒప్పందం ఇద్ద‌రు క‌లిసి ఉన్న స‌మ‌యంలో బాగానే ఉంటుంద‌ని..ఆ ఇద్ద‌రూ ప‌దవులు వీడితే త‌రువాత ఇది అమ‌లవుతుంద‌ని న‌మ్మ‌కం ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీనికి కొన‌సాగింపు ప్రాతిప‌దిక ఏంట‌ని నిల‌దీసారు. ముఖ్య‌మంత్రి అన్నీ తన‌కే తెలుస‌ునని భావిస్తున్నట్లున్నారు. వాస్తవానికి ముఖ్య‌మంత్రి వయసు..తన అనుభ‌వం అంత లేదని చంద్రబాబు ఎద్దేవ చేశారు.


మరింత క్లారిటీ ఇచ్చిన జగన్
చంద్రబాబు కామెంట్స్ పై ముఖ్య‌మంత్రి జగన్ ఘాటుగా బదులిచ్చారు. ప్రతిపక్ష నేత ప్రతీ దానికి 40 ఏళ్ల అనుభ‌వం అంటారు..ఇదేనా మీ ప‌రిజ్ఞానం అంటూ చంద్రబాబును ప్ర‌శ్నించారు. ఇది ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ద్య ఒప్పందం కాద‌ని..రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య అగ్రిమెంట్ అనే విషయాన్ని ప్రతిపక్ష నేతలు తెలుగుకోవాలని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల పైన కోర్టుకు వెళ్తే ప‌రిష్కారం సత్వార పరిస్కారం ల‌భించ‌దని..ఇరువురి మ‌ధ్య స‌యోద్య‌తోనే ఉప‌యోగం ఉటుందనే తన ఆలోచన అన్నారు..అందుకే కేసీఆర్‌తో స‌త్సంబంధా ల‌తో ముందుకు వెళ్తున్నామ‌న్నారు.కేసీఆర్ త‌మ భూభాగం నుండి కృష్ణా ఆయుక‌ట్లుకు నీరు వ‌చ్చేలా అంగీక‌రించి..ముందుకు వ‌చ్చినందుకు అభినందించాల‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.