AP: వారం రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు
కరోనా వైరస్ కేసులు ఏపీలో గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్టు అర్ధమౌతోంది.
కరోనా వైరస్ ( Corona virus ) కేసులు ఏపీలో గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్టు అర్ధమౌతోంది.
కరోనా వైరస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) దేశంలో టాప్ 4 లో ఉన్నా..గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వారం రోజుల్నించి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోంది. అటు దేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా నిర్దారణ పరీక్షల్ని ( Corona tests ) మాత్రం రికార్డు స్థాయిలో నిర్వహిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకూ రోజుకు పది వేల కేసులు బయటపడుతుండగా..ఇప్పుడు గత వారం రోజులుగా 7 వేల కేసులు బయటపడుతున్నాయి. అదే సమయంలో నిర్ధారణ పరీక్షలు మాత్రం ప్రతిరోజూ 70-75 వేలు నిర్వహిస్తున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 75 వేల 990 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...7 వేల 293 మందికి పాజిటివ్ గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 6 లక్షల 68 వేల 751 కాగా...ఇప్పటివరకూ 5 లక్షల 97 వేల 294 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65 వేల 794 యాక్టివ్ కేసులున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో రాష్ట్రంలో 9 వేల 125 మంది కోలుకున్నారు.
కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో 57 మంది ప్రాణాలు కోల్పోగా...ఇప్పటివరకూ 5 వేల 663 మంది మృతి చెందారు. ఇక ఏపీలో ఇప్పటివరకూ 55 లక్షల 23 వేల 786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. Also read: SPB last rites: బాలుకు నివాళులర్పించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్