Arvind Kejriwal On Gujarat assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడికానున్నాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గుజరాతీ భాషలో ఆ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'గుజరాత్ ప్రజలు ఈసారి పెద్ద మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. కచ్చితంగా గెలుస్తాం..' అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 'గుజరాత్ ప్రజలకు నా ప్రేమపూర్వక సందేశం..' అని మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇటీవలె పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లోనూ బరిలో నిలిచేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తమ గెలుపు అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంగా.. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి దశలో 89 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. తొలి దశలో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 14. రెండవ దశలో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 17.


గుజరాత్‌లో మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 2,53,36,610, మహిళలు 2,37,51,738 ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఆ తరువాత ఎన్నికైన కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.


హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను నవంబర్ 12న ఒకే దశలో నిర్వహించి.. డిసెంబర్ 8న రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. 2017లో చివరిసారిగా గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమనార్హం. ఎన్నికల అనంతరం అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


Also Read: Governor Arif Mohammad Khan: కేరళలో ముదిరిన వివాదం.. ముఖ్యమంత్రికి గవర్నర్ సవాల్  


Also Read: విశ్వాసానికి అందలం.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ గా పోసాని నియామకం!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook