బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయుగుండంగా బలపడనుండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh )లో మరోసారి భారీ వర్షాల ముప్పు ఆవరించింది. హిందూ మహాసముద్రంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం ( Bay of Bengal )లో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం ప్రభావంతో..దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  రానున్న 48 గంటల్లో ఇది మరింతగా బలపడి..నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని ఐఎండీ ( IMD ) తెలిపింది. అనంతరం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపుగా పయనిస్తూ..నవంబర్ 25వ తేదీకు తమిళనాడు- పుదుచ్చేరి తీరప్రాంతానికి చేరుకోనుంది. ఈ కారణంగా నవంబర్ 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు ( Heavy rains ) పడే సూచనలున్నాయని ఐఎండీ సూచించింది.


దక్షిణ కోస్తా తీరం నుంచి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. మత్య్సకారులు వెేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అటు ఏపీలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతున్నాయి. అనంతపురంలో రికార్డు స్థాయిలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో 14.7, చింతపల్లిలో 15.2, అరకులో 18.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  Also read: GHMC Elections 2020: గ్రేటర్ బరిలో 68 నామినేషన్ల తిరస్కరణ