Pawan Kalyan Vs YS Jagan: శాసనసభ సమావేశాల నేపథ్యంతో ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నల్ల కండువాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మారరా? అని అసహనం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan Warning: పోలీసులపై రెచ్చిపోయిన మాజీ సీఎం జగన్‌.. గుర్తుంచుకో అంటూ వార్నింగ్‌


 


అమరావతి వెలగపూడిలోని అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం అసెంబ్లీ ఆవరణలో జరిగిన టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌కు ఇంకా తత్వం బోధపడినట్టు లేదు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం విస్మయం కలిగిస్తోంది. గ్రూపు తగాదాలకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నాడు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం జగన్‌ అహంకార ధోరణికి నిదర్శనం' అని పవన్‌ తెలిపారు.

Also Read: YS Jagan Meets Governor: ఏపీలో హింసకు అడ్డుకట్ట వేయండి.. చంద్రబాబుపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు


 


'ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తానే ముఖ్యమంత్రినని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు' అంటూ పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు. జగన్‌ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఇక చంద్రబాబు పాలనపై పవన్‌ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ సహకరిస్తుందని స్పష్టం చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి