YS Jagan Warning: పోలీసులపై రెచ్చిపోయిన మాజీ సీఎం జగన్‌.. గుర్తుంచుకో అంటూ వార్నింగ్‌

YS Jagan Warns To Police Amid AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల రోజే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులను పేరు పెట్టి పిలుస్తూ వార్నింగ్‌ ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 22, 2024, 03:12 PM IST
YS Jagan Warning: పోలీసులపై రెచ్చిపోయిన మాజీ సీఎం జగన్‌.. గుర్తుంచుకో అంటూ వార్నింగ్‌

YS Jagan Warn To Police: ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం రోజే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలనం సృష్టించారు. నల్ల కండువాలు వేసుకుని మిగతా 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చిన జగన్‌ నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పేరు పెట్టి పిలుస్తూ వార్నింగ్‌ ఇచ్చారు.

Also Read: AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్‌ బాటలోనే వైఎస్‌ జగన్‌

అమరావతి వెలగపూడిలోని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్‌ ప్రసంగాన్ని వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

Also Read: YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్

అసెంబ్లీ ఆవరణ బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ముందుకు కదలకుండా అడ్డగించారు. ఈ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుకున్న ప్లకార్డులను పోలీసులు చించివేశారు. వారి చేతుల్లో నుంచి చించేసి కిందపడేశారు. పోలీసుల తీరుపై జగన్‌ విస్మయం వ్యక్తం చేశారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు వెళ్తున్న  వైఎస్‌ జగన్, వైఎస్సార్‌పీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డగించారు.

మధుసూదన్ గుర్తుంచుకో
'ప్లకార్డులు చించే అధికారం ఎవరిచ్చారు' అంటూ పోలీసులను జగన్‌ గట్టిగా నిలదీశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని.. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని పోలీసులను వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. 'మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో! అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం.. కానీ యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదు' అని తీవ్ర ఆవేశంతో జగన్‌ పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. అనంతరం నిరసనను కొనసాగించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News