Pawan kalyan reacts on rgv controversy: ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంశం కాక రేపుతుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆయన కోయంబత్తూరులో ఉన్నారని, షాద్ నగర్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయన కోసం ఇప్పటికే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పడిగాపులు కాస్తున్నట్లు తెలుస్తొంది. ఒంగోలు పోలీసులు మాత్రం పలు బృందాలుగా.. ఆర్జీవీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఆయన మాత్రం.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో  ఆర్జీవీ కన్పించకుండా పోవడంపై..  పెద్ద దుమారమే చెలరేగిందని చెప్పుకొవచ్చు. ఈ రోజు ఆర్జీవీ వివాదంపై.. అరెస్ట్ ల నుంచి ఏపీలో హైకొర్టులో మూడు పిటిషన్ లు విచారణకు రానున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆర్జీవీ కన్పించకుండా పోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి స్పందించినట్లు తెలుస్తొంది.


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు . కేంద్ర మంత్రులు.. నిర్మల సీతారామన్, గజేంద్ర సింగ్ షేకావత్, లలన్ సింగ్ లో భేటీ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో భేటీ అనంతరం ఢిల్లీలోని మీడియా వారు.. ఆర్జీవీ అరెస్టు గురించి పవన్ ను ప్రశ్నించారంట. దీనికి ఆయన ఇది హోంశాఖ, లా అండ్ ఆర్డర్   పరిధిలోని అంశమని చెప్పారంట. అంతే కాకుండా.. పోలీసులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారంట.


Read more: Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?


తన పరిధి కాదని.. మీరు అడుతున్నారు.. కాబట్టి దీనిపై సీఎం చంద్రబాబు వరకు తీసుకెళ్తానని క్లారిటీ ఇచ్చారంట. ఇక చంద్రబాబును ఇబ్బంది పెట్టిన సమయంలో ధైర్యంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు.. ఇప్పుడెందుకు అంతయాక్టివ్ గా పనిచేయడంలేదో.. సీఎంను అడుగుతానని.. అలాగే ఢిల్లీలో మీడియా వారు అడిగిన ప్రశ్నల్ని.. కూడా ప్రస్తావిస్తానని పవన్ చెప్పారంట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఏపీ పోలీసులు రెండు సార్లు నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరొవైపు ఏ నిముషంలో నైన ఆర్జీవీని అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.