ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ( ఏప్రిల్ 11న) ఉదయం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంలో ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో మొత్తం  3 కోట్ల 93 లక్షల 45 వేల 717 ఓటర్లు ఉన్నారు. ఇందులో  10 లక్షల 15 వేల 219 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. ప్రవాసాంధ్ర ఓటర్లు సంఖ్య 5,323, దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,27,734 ఉంది ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని  రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల 920 పోలింగ్ కేంద్రాలు. ఎన్నికల విధుల్లో  3 లక్షలు ఎన్నికల సిబ్బంది ఈసీ నియమించింది. ఎన్నిల విధుల్లో ఒక లక్షా 20 వేల మంది పోలీస్ బలగాలు పాల్గొంటున్నాయి . ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు, బలగాల రవాణాకు వినియోగించే  7 వేల 600 బస్సులు ఏర్పాటు చేశారు