YS Vijayamma Resign: వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్.. తన తల్లి, చెల్లిని దూరం పెట్టారనే టాక్ వస్తోంది. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం.. విజయమ్మకు ఆమెకు అండగా ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరింది. సీఎం జగన్ ను ఇటీవల కాలంలో విజయమ్మ కలవలేదు. విజయమ్మ పుట్టినరోజు కూడా జగన్ ఆమెను కలవలేదు. తన బర్త్ డే రోజు ఖమ్మం జిల్లాలో పాదయాత్రలో ఉన్న షర్మిల దగ్గరకు వెళ్లింది విజయమ్మ. దీంతో జగన్, విజయమ్మ మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయిందనే ప్రచారం సాగింది. విపక్షాలు కూడా ఇవే అరోపణలు చేస్తున్నాయి. అధికారం దాహంతో తల్లి, చెల్లిని జగన్ బయటికి పంపించేశారని చెబుతున్నాయి. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు విజయమ్మ. జగన్ తో విభేదాలతో ఆ పదవికి రాజీనామా చేస్తారనే చాలా కాలంగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని వైసీపీ వర్గాలు ఖండిస్తూ వచ్చాయి. అయితే వైసీపీ విషయంలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు విజయమ్మ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఆ పార్టీ తొలి ప్లీనరీ గుంటూరులో జరుగుతోంది. పార్టీ ప్లీనరీకి హాజరైన విజయమ్మ.. సభా వేదికపైనే  సంచలన ప్రకటన చేశారు. పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్లినరీ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయమ్మ. తన కొడుకు, కూతురు మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.  తన అన్న జగన్ కు ఇబ్బంది లేకుండా ఉండాలనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందని చెప్పారు. తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారని అన్నారు. జగన్, షర్మిల ఇద్దరు వేరువేరు రాష్ట్రాల్లే వేరు వేరు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారన్నారు. తాను షర్మిల పార్టీ సభలకు వెళుతుండటంతో కొందరు రాద్ధాంతం చేస్తున్నారని.. రెండు పార్టీల్లో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారని విజయమ్మ తెలిపారు.అందుకే వైసీపీకి రాజీనామా చేసి షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఏపీ కంటే ముందు తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని.. అందుకే షర్మిల వెంట ఉండాలని డిసైడ్ అయ్యానని విజయమ్మ తెలిపారు. ఏపీలో జగన్ మంచి పాలన అందిస్తున్నారని.. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.


వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వైఎస్ విజయమ్మను కొన్ని రోజులుగా జనగ్ పట్టించుకోవడం లేదని.. కనీసం ఆమె యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పుట్టినరోజున కూడా తల్లిని పలకరించలేదని అంటున్నారు. ఆమెను బెదిరించి బలవంతంగా పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్లీనరీ సభలో ప్రసంగించిన విజయమ్మ ముఖంలో భయం, ఆవేదన కనిపించాయని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. రాజీనామా ప్రకటన చేస్తున్నప్పుడు ఆమె కళ్లలో ఎక్కడలేని బాధ కనిపించిందని చెప్పారు. పార్టీలో తానెక్కడినే సుప్రీం అనిపించుకునేందుకు తల్లిపైనా దారుణంగా జగన్ వ్యవహరించారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం రెండు పార్టీల్లో పనిచేయడం నైతికంగా సరైంది కాదనే విజయమ్మ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. షర్మిల కోసం పనిచేస్తానని.. జగన్ అన్నివిధాలా అండగా ఉంటానని ప్లీనరీ ప్రసంగంలో విజయమ్మ క్లారిటీగా చెప్పారని స్పష్టం చేస్తున్నారు,


అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందనే వాదన వస్తోంది. కొన్ని రోజులుగా కుటుంబంలో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవాలని డిసైడైన జగన్ కుటుంబ సభ్యులు.. వైఎస్సార్ జయంతికి రోజు ముందే ఇడుపులపాయకు వచ్చారని అంటున్నారు. గురువారం రాత్రి ఇడుపులపాయలో  కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. జగన్, విజయమ్మ, షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. సీఎం జగన్ తీరుపై అసహనంగా ఉన్న విజయమ్మ.. షర్మిల వెంట ఉంటానని విజయమ్మ చెప్పడంతో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆస్తి పంపకాలు క్లియర్ చేసుకున్నారని అంటున్నారు. వైఎస్ వివేకా కూతూరు సునీతకు పార్టీలో ప్రాధాన్యక ఇవ్వాలని.. ఇకపై విభేదాలు లేకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. మొత్తంగా వైసీపీ పదవికి విజయమ్మ చేసిన రాజీనామా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. విజయమ్మ ప్రకటన వైసీపీ నేతల్లోనూ కలవరం కనిపిస్తుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జగన్ ను టార్గెట్ చేయడానికి విపక్షాలకు విజయమ్మ అంశం అస్త్రంగా మారనుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


Also Read: Planet Shanti Remedy: శని గ్రహ కోపానికి గురికాకుండా ఉండాలంటే.. ఈ పొరపాట్లు చేయొద్దు!


Also Read: ఆషాఢ పూర్ణిమ రోజున స్నానం, దానం చేయండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook