RGV Satires: ఎక్స్ వేదికగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేని పవన్ కళ్యాణ్‌పై చెలరేగిపోయారు. టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తుపు సెటైర్లు అందుకున్నారు. ఒక ట్వీట్‌కు అయితే ఏకంగా 4 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఎలా వైరల్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. అంతలా ఏమన్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం-జనసేన పొత్తు, జనసేనకు లభించిన 24 అసెంబ్లీ సీట్లు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఇవే చర్చనీయాంశాలుగా మారాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే అంశాన్ని ఎత్తుకున్నారు. ఎక్స్ వేదికగా పవన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించింది. మరో 10-15 సీట్లు బీజేపీకు కేటాయించి మిగిలిన అన్ని సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తోంది. జనసేనకు ఇంత తక్కువ స్థాయిలో సీట్లు దక్కడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. జనసేన-టీడీపీ ఉమ్మడి జాబితా విడుదలైనప్పట్నించి రామ గోపాల్ వర్మ ఎక్స్‌లో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. ఓ పోస్ట్‌కు అయితే ఏకంగా 4 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆర్జీవీ చేసిన పోస్ట్‌లు ఇవీ..


జనసేనకు 23 సీట్లు ఇస్తే..అది టీడీపీ లక్కీ నెంబర్ అంటారు. అదే 25 ఇస్తే పవన్‌కు పావలా సీట్లు ఇచ్చారంటారు. అందుకే మద్యేమార్గంగా 24 సీట్లు ఇచ్చారు


24 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంట్ స్థానాలిచ్చారంటూ పవన్ మాట్లాడుతున్న క్లిప్ కూడా ఆర్జీవీ పోస్ట్ చేశారు. ఒక్కో పార్లమెంట్‌లో 6-7 అసెంబ్లీ స్థానాలుంటాయని, జనసేకు తక్కువ సీట్లు వచ్చినట్టు భావించకూడదదని, ఈ లెక్కన చూస్తే జనసేనకు 45 సీట్లు ఇచ్చినట్టేనంటూ కొత్త వివరణ ఇవ్వడంపై మరో సెటైర్ వేశారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అద్భుతమైన లాజిక్ తీశారంటూ కామెంట్ పెట్టారు.



ఒకవేళ పవన్ చెప్పినట్టు పార్లమెంట్ పరిదిలోని ఏడేసి అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేసినట్టే భావించాల్సి వస్తే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసినట్టు భావించాల్సి ఉంటుందని ప్రశ్నించారు. అసలీ లెక్కకు ఏమైనా తిక్కుందా అని సెటైర్ వేశారు. ఇవాళ పీకే కోసం బాధపడినంతగా ఎవరికోసం బాధపడలేదన్నారు. జనసేన పరిస్థితి చూసి దిగులు కలుగుతుందన్నారు. 


Also read: Vangaveeti Radha: వంగవీటి రాధాకు దక్కని సీటు, మరి ఆయన పయనమెటు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook