COVID-19 in AP: కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్ విడుదల
ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 60,804 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 10,392 మందికి కరోనా పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయ్యింది. కొత్తగా 72 మంది కరోనాతో మృతి చెందారు.
అమరావతి : ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 60,804 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 10,392 మందికి కరోనా పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయ్యింది. కొత్తగా 72 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 4,55,531 కి చేరగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 4,125 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ ( AP COVID-19 Health bulletin ) విడుదల చేసింది. Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి
గత 24 గంటల్లో 8,454 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు కరోనాతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 3,48,330 మందికి చేరుకుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 2, బుధవారం నాటివరకు 1,03,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also read : AP High Court: మద్యం ప్రియులకు ఉపశమనం.. మూడు బాటిళ్లు తెచ్చుకోవచ్చు
కొవిడ్-19 వల్ల గత 24 గంటల్లో నెల్లూరులో పదకొండు మంది, చిత్తూరులో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది, ప్రకాశంలో ఎనిమిది, కృష్ణాలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్‌లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూలులో ఒకరు చనిపోయారు ( COVID-19 death toll ). Also read : Viral video: అంబులెన్స్‌కి దారి ఇచ్చిన ఏపీ సీఎం కాన్వాయ్