తాడేపల్లి: విజయవాడలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దివ్య తేజస్వి ( Divya Tejaswini murder case ) కుటుంబసభ్యులు ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దివ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత ( AP Home minister Mekathoti Sucharitha ) దగ్గరుండి ముఖ్యమంత్రిని కలిపించారు. దేవినేని అవినాష్‌తో పాటు దివ్య తేజస్విని తండ్రి జోసెఫ్, తల్లి కుసుమ, సోదరుడు దినేష్, బంధువు షకీరా ( Divya Tejaswini family ) ముఖ్యమంత్రిని కలిశారు. దాదాపు అరగంటకుపైగా దివ్య  తల్లిదండ్రులతో మాట్లాడిన సీఎం జగన్ ( AP CM YS Jagan ).. వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్థిక సహాయం కింద దివ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలను అందించనున్నట్టు ప్రకటించారు. Also read : AP CM YS Jagan: వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాగా కష్టపడి చదువుకునే తమ కూతురిని ప్రేమోన్మాది నాగేంద్ర ( Psyco Nagendra ) ఇంట్లోకి చొరబడి మరీ నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపాడని దివ్య తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం జోసెఫ్ మాట్లాడుతూ.. మా కుటుంబానికి ధైర్యాన్నిచ్చేలా ముఖ్యమంత్రి జగన్ తమతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చారని అన్నారు. నిందితుడు నాగేంద్ర కోలుకున్న వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం అధికారులను అదేశించారు. Also read : Divya Tejaswini murder case: దివ్యతేజస్విని మర్డర్‌పై స్పందించిన హోం మంత్రి

ముఖ్యమంత్రి చలించిపోయారు: హోంమంత్రి మేకతోటి సుచరిత:
దివ్య తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. దివ్య కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి వారి మాటల్లోనే తెలుసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి చలించిపోయారని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. చక్కగా చదువుకునే అమ్మాయిని దారణంగా హత్య చేయడం దారుణమని హోంమంత్రి ఖండించారు. దివ్య కుటుంబానికి అండగా నిలిచి, వారిని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. 


దివ్యను హత్య చేసిన నాగేంద్ర మరో రెండు రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది. హాస్పిటల్ నుండి డిచార్జి అయిన వెంటనే అతడిని అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని దిశ చట్టం ( Disha Act 2019 ) ప్రకారం 21 రోజేల్లోనే శిక్ష పడేలా చట్టం రూపొందించడం జరిగింది. తన చదువేదో తాను చదువుకుంటున్న దివ్యను తెలిసితెలియని వయస్సులోనే నిందితుడు నాగేంద్ర వెంటబడి వేదించాడు. దివ్య తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి బెదిరించాడు. చివరకు దివ్యను పొట్టనపెట్టుకున్నాడు. అటువంటి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత స్పష్టంచేశారు. Also read : APPSC JL Results 2020: జేఎల్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ


ఆడపిల్లలను ఎవరైనా వెంటపడి వేధించినా.. ఏదైనా ఆపదలో చిక్కుకున్నా వెంటనే డయల్ 100, దిశ యాప్ ( Disha mobie app ), అదేవిధంగా ఏపీ పోలీస్ సేవ యాప్‌కు ( AP Police seva app ) కాల్ చేసి ఫిర్యాదు చేయాలని హోంమంత్రి సుచరిత సూచించారు. రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితులను విడిచిపెట్టదని హోంమంత్రి సుచరిత స్పష్టంచేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe