Tejaswini murder case updates: అమరావతి: విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడి, ఆమెను హత్య చేసిన ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ( AP home minister Mekathoti Sucharitha ) స్పందించారు. విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య ఘటనను తీవ్రంగా ఖండించిన హోంమంత్రి.. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి ఉన్మాద చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన హోంమంత్రి... ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్ ఉన్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని అతి కిరాతంగా హతమార్చడం దారుణమని అన్నారు. Also read : AP COVID-19: తాజాగా 4,038 కరోనా కేసులు.. 38 మంది మృతి
ప్రేమను నిరాకరించిందనే కారణంతో తేజస్వినిని నాగేంద్రబాబు ( Nagendra Babu ) అనే యువకుడు కత్తితో పొడిచి ఆమె మృతికి కారకుడు అవడంతో పాటు ఆ తర్వాత తనను తాను గాయపరుచుకోవడం ఒక ఉన్మాదమైన చర్యే అవుతుందని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. తేజస్విని తల్లిదండ్రులు ఎవ్వరూ ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటికెళ్లి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడని.. నాగేంద్ర బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్వి చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు.
తేజస్విని హత్యపై ( Engineering student Tejaswini murder ) ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని.. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత తెలిపారు. Also read : YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్
ఇదిలావుంటే, ఈ ఘటనపై నిందితుడు నాగేంద్ర బాబు సోదరుడు నాగరాజు స్పందిస్తూ.. తన సోదరుడు తేజస్వినిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ విషయం నాగేంద్ర బాబు చెబితేనే తనకు తెలిసిందని నాగరాజు తెలిపాడు. ఐతే నాగరాజు చేస్తోన్న వ్యాఖ్యలపై తేజస్విని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గాలి తిరుగుడు తిరిగే యువకుడిని ఇంజనీరింగ్ చదువుతున్న తమ కూతురు ఎందుకు పెళ్లి చేసుకుంటుందని.. కేసును తప్పు దోవ పట్టించేందుకే ఈ కట్టు కథ అల్లుతున్నారని తేజస్వి తల్లి మండిపడ్డారు. Also read : Building washed away in flood: వరదల్లో కూలి కొట్టుకుపోయిన కొత్త బిల్డింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe