డమ్మి ఈవీఎంల గుట్టు రట్టు చేసిన పోలీసులు
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ డమ్మీ ఈవీఎంల కలకలం సృష్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయపటపడింది. పోలీసులు నిర్వహించిన సోదాల్లో మొత్తం 350 డమ్మీ ఈవీఎంలను పట్టుకున్నట్లు సమచారం. ఈవీఎలను తరలించేందుకు ఉపయోగవించిన వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
ఈవీఎంలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... జంగారెడ్డిగూడెం ఆర్డీవోకార్యాలయానికి తరలించారు. హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిస్తుండగా వీటిని పట్టుకున్నట్టు సమాచారం. తాజా ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా పట్టుబడ్డ ఈవీఎంలను ఎక్కడి నుండి తీసుకొచ్చారు ? ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ తరలిస్తున్న పోలీసలు ప్రాధామికంగా నిర్ధారించుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులు 2400 డమ్మీ ఈవీఎంలను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పోలీసలు ఈ డమ్మీ ఈవీఎంల వ్యవహారాన్ని ప ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.