మలద్వారంలో లాఠీలు జొప్పించి చిత్రహింసలు..? సీఐ థర్డ్ డిగ్రీతో యువకుడి ఆత్మహత్య..
Youth Commits Suicide in East Godavari:తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. స్థానిక సీఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Youth Commits Suicide in East Godavari: తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. స్థానిక సీఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలికతో ప్రేమ వ్యవహారంలో విచారణ నిమిత్తం యువకుడిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్లు చెబుతున్నారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు మండపేటలో ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. మండపేట గాంధీనగర్‌కి ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ (22) అనే యువకుడు అదే కాలనీకి చెందిన ఓ ఇంటర్ బాలికను ప్రేమించాడు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు స్థానిక మండపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ దుర్గా ప్రసాద్ విచారణ నిమిత్తం భగవాన్‌ని పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన యువకుడు సీఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కుటుంబ సభ్యులతో చెప్పాడు.
తమ ఇంటికి సమీపంలోని పొలంలో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భగవాన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంతో మండపేటలో ఆందోళనకు దిగారు. సీఐ దుర్గా ప్రసాద్ రూ.20 వేలు లంచం తీసుకుని భగవాన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపించారు. మల ద్వారంలో లాఠీలు చొప్పించి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై డీఎస్పీ బాలచంద్రారెడ్డి స్పందిస్తూ.. సీఐ దుర్గా ప్రసాద్‌ను వీఆర్‌కు పంపించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదన్నారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ తర్వాత సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషి పెరారివాలన్‌కు సుప్రీం బెయిల్...
ALso Read: OPPO A74 Amazon: రూ.3 వేలకే OPPO 5జీ స్మార్ట్ ఫోన్.. ఈ ఒక్కరోజు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook