AP Elections: దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగాయి. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే దఫాలో సోమవారం పోలింగ్‌ జరిగింది. గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలో మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని మాత్రం తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీయగా.. మరికొన్ని చోట్ల హింసాత్మకంగా మారింది. పోలింగ్‌ సరళిపై ఎన్నికల సంఘం సీఈఓ ముకేష్ కుమార్ మీనా వివరాలు వెల్లడించారు. ఇంకా కొన్ని చోట్ల పోలింగ్‌ జరుగుతోందని.. క్యూ లైన్‌లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Jr NTR Autograph: అభిమాని 'గుండె' పిండేశాడు.. ఓటు వేసిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏం చేశాడంటే?


అమరావతిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముకేశ్‌ కుమార్‌ మీనా మాట్లాడారు. 'పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. 275 బీయూలు, 217 సీయూలు, 600 వీవీ ప్యాట్‍లకు సంబంధించి సమస్యలు వచ్చాయి' అని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలను అధికంగా ఉంచినట్లు చెప్పారు. పలుచోట్ల హింసాత్మక ఘటనలపై ఆయన స్పందించారు. హింసాత్మక సంఘటనలు జరుగుతాయని ముందే సమాచారం ఉందని పేర్కొన్నారు.

Also Read: Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు


'అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై సమాచారం అందింది. హింసాత్మక ఘటనలు జరిగే చోట్ల పటిష్ట ఏర్పాట్లు చేశాం. పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందగా.. మాచర్లలో ఈవీఎం యంత్రాలు దెబ్బతిన్నాయి. 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించాం' సీఈవో ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు.


కోడూరులో 2 ఈవీఎంలు, దర్శిలో రెండు చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నాయని సీఈఓ తెలిపారు. పలుచోట్ల సాయంత్రం ఆరు తర్వాత క్యూలో ఉన్నవారు ఓటు వేస్తున్నారని.. 300 మందికిపైగా క్యూలో ఉన్న చోట్ల రాత్రి 10 వరకు పోలింగ్ జరగవచ్చని వివరించారు. గతం కంటే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని ప్రకటించారు. ఓటర్లు పెద్దఎత్తున వచ్చి ఓటు వేసినట్లు తెలిపారు. సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ జరిగినట్లు చెప్పారు.


'తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తాం. రీపోల్‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. రేపు ఫిర్యాదులపై, పార్టీల నాయకులతో ఆర్‌ఓలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారు. తంగెడలో బాంబు దాడి ఘటన మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది' అని సీఈఓ ముకేష్ కుమార్ మీనా వివరించారు.


దేశవ్యాప్తంగా ప్రశాంతంగా..
దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్ నమోదైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్రలో నాలుగో విడత ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో 75.66 శాతం, ఉత్తరప్రదేశ్‌ 56.35 శాతం, మహారాష్ట్రలో 52.49 శాతం, బీహార్‌లో 54.14 శాతం, జమ్మూకశ్మీర్‌లో 35.75 శాతం, జార్ఖండ్‌లో 63.14 శాతం, మధ్యప్రదేశ్‌లో 68.01 శాతం, ఒడిశాలో 62.96 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter