తొలి విడుత ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగిసింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి ఇక పుల్ స్టాప్ పడినట్లుయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ఎన్నికల ప్రచార గడువు ముగించాల్సి ఉంది. ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం తెరదించుతూ ఎన్నికల సంఘం  ఆదేశాలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసీ తాజా ఆదేశాలతో ఇక నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాజకీయ పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, పార్టీ నినాదాలు చేయడానికి వీలు లేదు. రోడ్లపై ఎక్కడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లైక్సీలు పెట్టడానికి వీలు లేదు. మీడియా సాధనాల్లో కూడా ఇక రాజకీయ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వరాదు.


ఏపీలోని 175 అంసెబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా... అందులో 16 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 


ఎన్నికల ప్రచారగడువు ముగియడంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు. భద్రతా ఏర్పనాట్ల చర్యలో భాగంగా బెటాలియన్ సభ్యుడలతో పాటు భారీగా పోలీసులు రంగంలోకి దిగనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలలతో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు