Elections commission serious on ap congress chief ys sharmila: దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. ముఖ్యంగా ఇరు తెలుగురాష్ట్రాలలో ఎన్నికల హీట్ ఒక రేంజ్ లో ఉంది. అన్ని పార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో ఏర్పడి ఎన్నికలలో ముందుకు వెళ్తున్నాయి. దీనికి భిన్నంగా వైఎస్సార్సీపీ సీఎం జగన్ ఒంటరిగానే ఎన్నికల్లో నిలిచారు. ఇక వైఎస్ షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరి తన దైన స్టైల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ ను తన పదునైన విమర్శలతో ఉక్కిరిబిక్కరి చేస్తున్నారు. ఏపీలో ఎక్కవ ప్రచారం నిర్వహించిన కూడా జగన్ ను ఏకీపారేస్తున్నారు. సీఎం జగన్ పాలనలో,  ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. సీఎం జగన్ , కేంద్రంలో ఉన్న బీజేపీకి దత్తపుత్రుడిగా మారారన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్టు, ఏపీకి విభజన హమీలు,కేంద్ర ప్యాకేజీ లు తీసుకొని రావడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని షర్మిలా తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. వైఎస్ షర్మిల ఇటీవల బద్వేలులో ఎన్నికలప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలలో మాట్లాడుతూ.. సీఎం  జగన్ ఏపీని మోసం చేసిన విధానం గురించి అనేక ఆరోపణలు గుప్పించారు. అంతే కాకుండా.. మాజీ మంత్రి వివేక హత్య విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక తలపైన అంత బలమైన గాయమున్న గుండెపోటుతో మరణించారంటూ ఎలా తమ చానెల్స్ లలో చెప్పిస్తారంటూ ఎద్దేవా చేశారు. వివేకనుం చంపిన వాళ్లను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. వివేక మరణం తర్వాత జరిగిన ఘటనలను ప్రజల ముందు ఉంచారు.


ఇదే క్రమంలో ఇటీవల కడప కోర్టు.. మాజీ మంత్రి వివేక హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో ఎవరు కూడా, ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీన్ని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. అయితే.. వైఎస్ షర్మిల మాత్రం కోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తు ఎన్నికల ప్రచారంలో.. మాజీ మంత్రి వివేక హత్యకేసుపై మరల వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యింది.


Read More: Bijnor wife Torture: శాడిస్ట్ భార్య పైశాచీకం.. భర్తను సిగరేట్లతో కాలుస్తూ, మంచానికి కట్టేసీ..


కోర్టు ఆదేశాలను పట్టించుకోని షర్మిలపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నిలక వేళ ఏపీలో అన్ని పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో  మే 13 పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కూడా అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు,స్థానిక పోలీసు యంత్రాంగంతో కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఏపీ డీజీపీని కూడా మార్చిన విషయం తెలిసిందే. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter