Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయం సాధించన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపధ్యంలో నిలిచిపోయిన ఏలూరు కార్పొరేషన్ ఫలితం వెలువడేందుకు మార్గం సుగమమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (Ap local body elections) ఏలూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు మార్చ్ 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించగా..జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ధర్మాసనం ఏలూరు ఎన్నికలకు కూడా అనుమతిచ్చారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టకూడదని ఆదేశాలిచ్చారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్(Eluru Corporation Election Counting) ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.ఈ నెల 25న ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టు(Ap high court) క్లియరెన్స్ ఇచ్చింది.


Also read: COVID-19 cases: తెలంగాణ, ఏపీలో కరోనా కేసులపై లేటెస్ట్ అప్‌డేట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook