No Hidden Camera: ఇది నిజం.. గుడ్లవల్లేరు గర్ల్స్ హాస్టల్లో రహాస్య కెమెరాలు లేవు: పోలీస్ శాఖ
No Hidden Cameras In Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు కళాశాలలో రహాస్య కెమెరాలు లేవని పోలీస్ శాఖ కూడా స్పష్టం చేసింది. ఏలూరు ఐజీ తాజాగా అదే విషయాన్ని వెల్లడించారు.
Hidden Cameras: తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహాస్య కెమెరాలపై పోలీసులు కూడా ఒకటే మాట చెబుతున్నారు. గతంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పిన విషయాన్నే మరోసారి పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అమ్మాయిల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లలో రహాస్య కెమెరాలు లేవని మరోసారి పోలీసులు స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండుల ముందే విచారణ చేశామని.. ఎలాంటి కెమెరాలు లేవని ప్రకటించారు.
Also Read: Pawan Kalyan: ఏపీకి అనారోగ్యం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబానికి వైరల్ జ్వరం
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్‌రూములలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై పోలీసు బృందాల దర్యాప్తుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. 'కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి రహాస్య కెమెరాలు గుర్తించలేదు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించి దర్యాప్తు చేశాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం' అని వివరించారు.
Also Read: YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్
కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. హాస్టల్ వాష్‌రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 'విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్‌రూముల్లో తనిఖీలు చేశాం. వాష్‌రూమ్‌లు, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదు' అని స్పష్టం చేశారు.
భయపడొద్దు
విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని.. కెమెరాలు, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఎవరూ చెప్పలేదని ఐజీ తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల 14 ఫోన్లు, 6 ల్యాప్‌ట్యాప్‌లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నాం. 'విద్యార్థులు ఎవరూ భయపడనవసరం లేదు. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి రహాస్య కెమెరాలు లభ్యం కాలేదు' అని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. కాగా ఈనెల 1వ తేదీన కూడా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇదే ప్రకటన చేశారు. ఇప్పుడు ఐజీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter