పది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ ( vijayawada swarna palace covid centre ) గురించి నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. విచారణ కమిటీ నివేదికలో అన్ని ఉల్లంఘనలు బయటపడ్డాయి. బహుశా అందుకే డాక్టర్ రమేష్ పరారీ ( Dr Ramesh ) లో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో నడుస్తున్న కోవిడ్ సెంటర్ ( covid centre fire accident ) లో చెలరేగిన అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. పది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక అందింది. రమేష్ ఆసుపత్రి ( Ramesh Hospital ) అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాల్ని, నిబంధనల్ని ఉల్లంఘించినట్టు నివేదిక పేర్కొంది. వైద్య విలువల్ని నీరుగార్చడమే కాకుండా...డబ్బుసంపాదనే ధ్యేయంగా వ్యవహరించిందని కమిటీ నిర్ధారించింది. ఆఖరికి ప్రభుత్వ అనుమతి రాకముదే కోవిడ్ సెంటర్ ను ప్రారంభించినట్టు కమిటీ నివేదికలో వెల్లడైంది. లీజుకు తీసుకున్న హోటల్ లో అగ్నిమాపక భద్రత ఉందా లేదా అనేది పరిశీలించకుండానే పేషెంట్లను తరలించిందని కమిటీ ( Enquiry committee ) స్పష్టం చేసింది. Also read: AP: రాష్ట్రంలో 30 లక్షలు దాటిన పరీక్షలు, దేశంలో టాప్


కోవిడ్ నెగెటివ్ వచ్చినవారిని కూడా చేర్చుకుని చికిత్స


కోవిడ్ సెంటర్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కు పాతర


అవసరం లేకపోయినా ఖరీదైన రెమ్ డెసివర్ ( Remdesivir medicine ) మందుల ఉపయోగం


అనుమతి లేకుండా ప్లాస్మా థెరపీ ( Plasma therapy ) నిర్వహణ


అనుమతుల్లేకుండానే ఎం 5, మెట్రోపాలిటన్ హోటళ్లలో కోవిడ్ సెంటర్ల నిర్వహణ


ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు..కార్పొరేషన్ కు 33 లక్షల పన్నుబకాయి


ఐసీఎంఆర్ ( ICMR ) లేదా డీసీజీఐ ( DCGI ) సైతం సీరియస్ గా పరిగణించే తీవ్రమైన అంశాలు ఉన్నాయి. అనుమతి లేకుండా ప్లాస్మా థెరపీను ప్రారంభించడం, అవసరం లేకపోయినా రెమ్ డెసివర్ ఇవ్వడం, నెగెటివ్ వచ్చిన పేషెంట్లకు కూడా చికిత్స అందించడం సీరియస్ నేరాలుగా ఉన్నాయి. ఇన్ని ఉల్లంఘనలు ఉన్నాయి కాబట్టే...డాక్టర్ రమేష్ పరారీలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. Also read: Oxford Vaccine: మనకు అందే తొలి కరోనా వ్యాక్సిన్ అదే..