కరోనా వైరస్ ( Corona vaccine ) కు వ్యాక్సిన్ ఒక్కటే కన్పించే పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా ఐదే ఐదు వ్యాక్సిన్లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. మరి ఇండియాకు అందే తొలి వ్యాక్సిన్ ఏదవుతుందనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారి ( Covid19 virus ) ఇంకా విజృంభిస్తూనే ఉంది. వ్యాక్సిన్ ఒక్కటే దీనికి పరిష్కారం. ప్రపంచంలో చాలా కంపెనీలు వ్యాక్సిన్ ( Vaccine ) అభివృద్ధిలో ఉన్నాయి. రష్యా ( Russia ) ఇప్పటికే రేసులో ముందంజలో ఉన్నానని ప్రకటించుకుంది. ఇక కీలకమైన మూడోదశ ప్రయోగాల్లో ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మూడోదశ ప్రయోగాల్లో ఉన్నది కేవలం ఐదు కంపెనీలు. ఇందులో ప్రధానంగా విన్పిస్తున్నది ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca ) , మోడెర్నా వ్యాక్సిన్ ( Moderna ) , ఫైజర్-బయోన్టెక్ ( Pfizer biontech ) వ్యాక్సిన్ లు. ఈ అన్ని కంపెనీల్లో సత్ఫలితాలనిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భావిస్తున్నది..అందరూ ఆశలు పెట్టుకున్నది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పైనే. Also read: Corona vaccine: అక్కడ వ్యాక్సిన్ ఉచితం, కంపెనీతో ఒప్పందం
ఇటు ఇండియా కూడా ఈ వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకుంది. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాగ్జిన్ ( Covaxin ) , జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న జైకోవ్ డి వ్యాక్సిన్ లు 1-2 దశల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియాకు చేరే తొలి వ్యాక్సిన్ కచ్చితంగా ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ ( Covishield ) మాత్రమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసి సరఫరా చేసే ఒప్పందం ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum instistute of india ) తో జరిగింది. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మరోవైపు ఉత్తత్తి చేసే వ్యాక్సిన్ లో 50 శాతం దేశానికే కేటాయిస్తామని కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా ప్రకటించింది.
అందుకే మొత్తం దేశం ఆశలు ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉన్నాయి. సెప్టెంబర్ నాటికి మూడోదశ పూర్తి చేసుకుని...డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులో తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. Also read: Rajiv Gandhi Jayanti: రాజీవ్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి