గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాద్ వెళ్లాలంటే విమానాశ్రయంలో సిబ్బంది టిక్కెట్ రేట్లను ఎప్పటికప్పుడు విపరీతంగా పెంచేసి బాదే బాదుడుతో పాటు.. అదనపు ఛార్జీల పేరుతో  చేసే మోసాలు శ్రుతిమించుతున్నాయని.. టికెట్ ధర ఎంత తక్కువైనా.. దాదాపు ఒక్కో ప్రయాణికుడికి అన్ని ఖర్చులు కలిసి 16 వేల రూపాయలకు పైగా చేతిచమురు వదులుతుందని ఈ రోజు  శాసనమండలిలో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు.


ఈ తీరు మారకపోతే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు, ఇంతేసీ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా చాలా నష్టం కలిగే అవకాశం ఉందని.. గన్నవరం ఎయిర్ పోర్టులో దళారీ వ్యవస్థకు, రోజు రోజుకూ పెరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని ముద్దుకృష్ణమ నాయుడు స్పీకరు ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించారు.