Big Shock YS Jagan: మరింత కష్టాల్లోకి మాజీ సీఎం జగన్.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే?
Jaggayyapeta Ex MLA Ready To Joins In Pawan Kalyan Janasena Party: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగలనున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నాయకుడు పార్టీకి గుడ్‌బై పలకనున్నట్లు సమాచారం.
Janasena Party Joinings: అధికారం కోల్పోయిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరింత కష్టాలు ఎదువుతున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం పార్టీ తీవ్రంగా సంక్షోభంలోకి పడింది. సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నైరాశ్యంలోకి వెళ్లారు. ఈ క్రమంలో పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నలుగురికి పైగా పార్టీని వీడగా త్వరలోనే భారీగా రాజీనామాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన కీలక నాయకుడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నేత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే కూటమిలోని ప్రధాన పార్టీ అయిన జనసేనలోకి చేరుతున్నట్లు సమాచారం.
Also Read: Pithapuram Floods: వరదల్లో డిప్యూటీ సీఎం ఇంటి స్థలం.. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో ప్రభుత్వ మాజీ విప్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో కుటుంబ బంధం ఉన్న నేపథ్యంలో చిరు ద్వారా ఉదయభాను జనసేన పార్టీలోకి వెళ్లేందుకు రాయబారాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చిరంజీవిని కలిసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: AP Debts: మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు అర లక్ష కోట్లు.. బాబు పాలనలో భారీగా అప్పులు
జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ఉదయభాను వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. తుది దశ చర్చలు పూర్తయి మరో రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో కండువా మార్చుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పార్టీలో చేరడమే కాకుండా పదవి కూడా ఆశిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి కావాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే ఆయన రాకను జనసేన పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉదయభాను జగ్గయ్యపేటలో జనసేన పార్టీని అణచివేసే ప్రయత్నాలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో జగ్గయ్యపేటలో కొత్తగా ఏర్పాటుచేసిన జనసేన దిమ్మెని ఉదయభాను, అతడి అనుచరులు ధ్వంసం చేసిన విషయాన్ని జనసేన పార్టీ ఇంకా మరచిపోలేదు. నాడు దిమ్మె ధ్వంసంపై ప్రశ్నించడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే నాయకులు, కార్యకర్తలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయాలను స్థానిక పార్టీ నాయకులు ఇంకా మదిలో పెట్టుకున్నారు. అయితే అధిష్టానం అతడి రాకను ఆహ్వానించినా జనసేన జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ఒకవేళ పార్టీలో ఉదయభాను చేరితే మాత్రం జగ్గయ్యపేట జనసేన పార్టీలో చాలా మంది నాయకులు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న వ్యతిరేకతను పట్టించుకోకుండా ఒకే సామాజికవర్గం అని చేర్చుకుంటే మాత్రం జగ్గయ్యపేట జనసేన పార్టీ రెండుగా చీలే ప్రమాదం ఉంది. మరి ఏం జరుగుతుందో కొన్నాళ్లు వేచి చూస్తే తెలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.